Saturday, September 28, 2024

కాళేశ్వరంలో తవ్వినకొద్దీ లీకేజీలు

- Advertisement -
- Advertisement -

బయటపడ్డ బ్యాంకు గ్యారంటీల కుట్ర
గుట్టుగా కాంట్రాక్టు ఏజెన్సీలకు రూ.1600కోట్ల విలువైన ధ్రువపత్రాలు
విచారణలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు
ఊహించినదానికన్నా ఎక్కువ వరద రావడం వల్లే సిసి బ్లాకులు దెబ్బతిన్నాయి: ఇంజినీర్లు

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం భారీ అవినీతి అక్రమాలతో కంపించి పోతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా జరిగిన అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. పనులు పూర్తి కాకముందే పనులు చేపట్టిన కాంటాక్టు ఏజెన్సీల కు ఒక అధికారి తనపై అధికారులకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకండా రూ.1600కోట్ల విలువ మేరకు బ్యాంకు గ్యారెంటీలను అప్పగించేశారు. కనీసం అండర్‌టేకింగ్ కూడా తీసుకోలేదు. నియమ నిబంధనలకు విరుద్ధ్దంగా ఆ అధికారి చేసిన సాహసానికి కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి భారీగానే ప్రతిఫలం దక్కినట్టు తెలుస్తోంది.

ఏ ప్రాజెక్టులోనైనా టెండర్ల ద్వారా పనులు పొందిన కాంటాక్టు ఏజెన్సీ పనులు పూర్తయ్యాక అ పనుల పట్ల తనిఖీలు, నాణ్యతలు, పరీక్షలు ప్రాజెక్టు మన్నికపై ధీమా, తదితర అంశాలపట్ల పూర్తి సంతృప్తి చెందాకే ఉన్నత స్థాయిలో తుదినిర్ణమం జరిగాక అధికారుల ఆదేశాల మేరకు ఆ పనులకు సంబంధించి ప్రారంభ దశలో ఏజెన్సీలు ప్రభుత్వానికి సమర్పించిన బ్యాంకు గ్యారెటీ ధృవీకరణ పత్రాలను తిరిగి వెనక్కు ఇవ్వాల్సివుంది. ఈ నిబంధనలు ఏమీ పాటించకుండానే మరో కంటికి తెలియకుండా రూ.1600కోట్ల విలు వ మేరకు బ్యాంకు గ్యారంటి ధృవపత్రాలను ఒక అధికారి సంబంధిత కాంట్టాక్టు ఏజెన్సీలకు వెనక్కు ఇచ్చేసినట్టు ఇంజనీర్లే బయట పెట్టారు. మంగళవారం నుం చి కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణను జస్టిస్ ఘోస్ కమిషన్ తిరిగి ప్రారంభించింది. కాళేశ్వరం ప్రా జెక్టుకు సంబంధించి జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ ముం దు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు.

నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులకు తెలియకుండా ఈఈ తిరుపతిరావు అనే అధికారి కాంట్రాక్టు ఏజెన్సీలకు రూ. 1600కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లుగా ఇంజినీర్లు కమిషన్‌కు తెలిపారు. బ్యాంకు గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని ఇం జినీర్లను కమిషన్ ప్రశ్నించింది. ఈఎన్సీ కార్యాలయం లో జరిగిన సమావేశం మినిట్స్‌ను అనుసరించకుండానే బ్యాంకు గ్యారేంటీలను విడుదల చేసినట్లుగా ఇంజినీర్లు జస్టిష్ ఘోస్ కమిషన్ ముందు వెల్లడించారు.దీంతో అసలు విషయం పడింది. ఆనకట్టల వద్ద డ్యామేజ్‌కు గల కారణాలను కమిషన్ ప్రశ్నించింది. అనుకున్న దానికంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లాక్‌లు దెబ్బతిన్నట్లు ఇంజినీర్లు సమాధానం ఇచ్చారు. 2022లో అనుకున్న దాని కంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లాక్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కూడా కమిషన్‌ను ఇంజినీర్లు వివరించారు.

కాళేశ్వరం ఎతిపోతల సాగునీటి ప్రాజెక్టు డిజైన్లు ఎవరు తయారు చేశారు? డిజైన్లు, డ్రాయింగ్‌లు తయారు చేసిన సంస్థ పేరేమిటని ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా, వ్యాప్కోస్ అనే సంస్థ తయారు చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు.వాటిని సీడీఓ సీఈ అనుమతితో అమలు చేసినట్లుగా స్పష్టం చేశారు. నిర్మాణానికి ముందు సైట్ల వద్ద ఏమైనా పరీక్షలు నిర్వహించారా అని కమిషన్ ప్రశ్నించగా ఎన్‌ఐటీ(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)వరంగల్ ఆధ్వర్యంలో పలు పరీక్షలు నిర్వహించినట్లు ఇంజినీర్లు కమిషన్‌కు వివరించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజిలకు సంబంధించిన నాణ్యత, నియంత్రణ గురించికమీషన్ ఇటీవల క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లను ప్రశ్నించింది. కమిషన్ ముందు వారు భిన్న సమాధానాలు చెప్పారు. బ్యారేజీల సైట్ విజిట్లు రెండు, మూడు నెలలకోమారు అని కొందరు, అసలు సైట్ విజిట్ చేయలేదని మరికొందరు సమాధానం ఇచ్చారు.

పొంతలేని సమాధానాలు ఇవ్వటం, మరి కొందరు తెలియదు, గుర్తులేదు వంటి సమాధానాలు ఇవ్వటంతో వాటిని కమీషస్ సీరియస్‌గా తీసుకుంది. కమీషన్‌ను తప్పుడు సమాచారం అందజేసి విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నార్న అభిప్రాయానికి వచ్చిన జస్టిస్ ఘోస్ వారిని తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపధ్యంలోనే అప్పటి నుంచి ఇంజనీర్ల విచారణను మరింత పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. సూటిగా ప్రశ్నలు వేస్తు వారిని నుంచి సరైన సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వారు కమీషన్‌కు సమర్పించిన అఫిడవిట్లను ఆధారంగా చేసుకుని విచారణలో వారిచ్చే సమాధానాలు అఫిడవిట్లలోని సమాచారంతో విశ్లేషించుకుంటున్నారు. శనివారం వరకు జరగనున్న ఈ ధపా విచారణలో నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు, ఈఎన్సీలు, రిటైర్టు అధికారులు, ఇంజనీర్లతో విచారణ జరపనున్నారు.
మేడిగడ్డపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం పూర్తయినట్టుగా కాంటాక్టు సంస్థకు గతంలో ఇచ్చిన వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించింది. నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఈఎన్సీ అనిల్ కుమార్‌కు ఆదేశాలిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News