Wednesday, January 22, 2025

డబుల్ మర్డర్ కేసులో దర్యాప్తు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

Investigation in Uppal murder case is going on

15 స్పెషల్ టీముల ఏర్పాటు
పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు

హైదరాబాద్ : తండ్రి, కుమారుడి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 15 స్పెషల్ టీములను పోలీస్ కమిషనర్ నియమించారు. పోలీసులు 30మందిని విచారించి నాలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారం రోజులు రెక్కీ నిర్వహించిన తర్వాత నిందితులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉప్పల్, గాంధీనగర్, హనుమసాయినగర్‌కు చెందిన నర్సింహశర్మ, అతడి కుమారుడు శ్రీనివాస్ శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే.

ముగ్గురు సభ్యుల సుపారీ గ్యాంగ్ తండ్రి, కుమారుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు హత్య చేసే ముందు మృతుల ఇంటి సమీపంలోని హాస్టల్‌లో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజులు బాధితుల రోజు వారీ దినచర్యలను గమనించి ఎవరూ లేని సమయంలో పూజ పేరుతో ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితులు 25 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్న యువకులుగా గుర్తించారు. సిసి కెమెరాలో హత్యకు సంబంధించిన దృశ్యాలు నమోదు కావడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శంషాబాద్ భూవివాదం…

తండ్రి, కొడుకుల హత్యకు శంషాబాద్‌లోని ఎనిమిది ఎకరాల భూవివాదమే కారణంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు బాధితులను ఆస్తి కోసం హత్య చేయించినట్లుగా అనుమానించారు. సమీప బంధువులు నర్సింహ శర్మ చెల్లి, బావ, తమ్ముడిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాని డబుల్ మర్డర్ కేసు ఒక్కసారిగా భూవివాదం వైపు మలుపు తిరిగింది. శంషాబాద్‌లోని ఎనిమిది ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. దీనిపై కన్నెసిన నిందితులే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News