హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం ఇద్దరు బాలింతలు మృతి చెందారు. బాలింతలు అనారోగ్యంతో మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా అక్కడ ఆసుపత్రి సిబ్బంది బాలింతలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింతలు మృతి చెందారు. బాలింతల కుటుంబ సభ్యులు , బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
దీని పై హెల్త్ కమీషనర్ అజయ్ కుమార్ స్పందిస్తూ మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి ఘటన పై దర్యాప్తు ముమ్మరం చేశారని తెలిపారు. ఘటన పై దర్యాప్తునకు కమిటి వేశామని హెల్త్ కమీషనర్ తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సర్జరీ జరిగిన రోజే మరో 11 సర్జరీలు జరిగాయని మిగిలిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదని హెల్త్ కమీషనర్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.