Monday, December 23, 2024

12మందిపై విచారణ చేయండి.. నాంపల్లి కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నరేష్, పవిత్ర కేసులో ఫిర్యాదులో పేర్కొన్న 12మంది విచారణ చేయాలని నాంపల్లి కోర్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆదేశించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని నరేష్, పవిత్ర గతంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ చేస్తుండగా తమ వక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు.

యూట్యూబ్ చానళ్లు, కొందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అసత్య ప్రచారం చేస్తూ తమ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులో ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టివి, లేటెస్ట్ తెలుగు డాట్‌కామ్, లైఫ్ ఇన్స్‌పిరేషన్, రమ్యరఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్‌క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్, దాసరి విజ్ఞాన్, కృష్ణమూర్తి, మిర్రర్ టివి ఛానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News