Monday, January 20, 2025

శిరీష మృతి కేసు దర్యాప్తు వేగవంతం

- Advertisement -
- Advertisement -
  • చెరువు ప్రాంతాన్ని సందర్శించిన ఎస్పీ కోటిరెడ్డి

పరిగి: కాళ్లాపూర్ గ్రామంలో జరిగిన శిరీష మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, పరిగి డిఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సిఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ విఠల్‌రెడ్డిలతో కలిసి కాళాపూర్ గ్రామంలోని శిరీష చనిపోయిన చెరువు ప్రాంతాన్ని సందర్శిం చి పరిశీలించారు.

నేర స్థలాన్ని పరిశీలించిన అనంతరం విచారణలో భాగంగా మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడటం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతికి ముందు సెల్‌ఫోన్ విషయంలో ఇంట్లోనే తన బావతో గొడవ పడిన శిరీష బయటికి వెళ్లి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతి మృతదేహాం, శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా బయటి వారు హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. టెక్నిక్ టీం, క్లూస్ టీం రకరకాల విధాలుగా ఆధారాలను కనుక్కుంటున్నామని అన్నారు.

పోస్టు మార్టం పూరైందని ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు. యువతి ఫోన్ లాక్ ఉన్నందునా దాన్ని సైబర్ క్రైమ్‌కు పం పించి పూర్తి వివరాలు తీసుకుంటామని అన్నారు. ఇది హత్యనా.. ఆత్మహత్య నా.. అనేది త్వరలో తేలుస్తామని చెప్పారు. ఈ విషయంపై శిరీష సోదరుడు శ్రీ కాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. తమ చెల్లెలు సూసైడ్ చేసుకునే పిరికిది కాదని ఏవరో హత్యనే చేశారని మృతురాలి సోదరుడు ఎస్పీకి తెలిపినట్లు తెలిసింది. త్వరలో కేసును ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు.

కాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కాళ్లాపూర్ సందర్శించి శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించారు. శిరీష మృతిపై పోలీసులు పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. శిరీష కుటుంబానికి అండగా ఉంటాను. ఈ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శిరీష కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News