Wednesday, December 18, 2024

భూత్పూర్ భూ కుంభకోణం’పై సమగ్ర విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా, భూ త్పూర్ మున్సిపాలిటీ, మండల పరిధిలోని భూ దాన్ భూములపై జిల్లా జాయింట్ కలెక్టర్ మోహన్ రావు సమగ్ర విచారణకు ఆ దేశించారు. భూదాన్ భూ ములకు సంబంధించిన రికార్డులన్నింటినీ కలెక్టరేట్‌కు అ ప్పగించాలని తహశీల్దార్‌కు ఆ దేశాలు జారీ చేశారు. ‘భూత్పూర్‌లో భూకుంభకోణం’ ‘రూ. 300 కోట్లు విలువైన భూదాన్ భూములు హాంఫట్’ శీర్షికన మంగళవారం ‘మన తెలంగాణ’ దినపత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తపై స్పందించిన జెసి.. జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయి ఆదేశాల మేరకు వి చారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై మరోవైపు దేవరకద్ర ఎంఎల్‌ఎ మధుసూదన్ రెడ్డి కూడా ఈ భూములపై ఆరా తీసినట్లు సమాచారం. ఎం ఎల్‌ఎ అసెంబ్లీ సమావేశా లు ఉన్న నేపథ్యంలో భూ దాన్ భూముల వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం.

భూత్పూర్ మం డలంలోని దాదాపు 12 గ్రామాల్లో భూదాన్ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. భూత్పూర్ నుంచి రెం డు జాతీయ రహదారులు ఉండడంతో ఈ భూములకు డి మాండ్ ఏర్పడింది. ఇదేఅదనుగా భావించిన గత ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులు భూదాన్ భూ ములను పెద్దఎత్తున అన్యాక్రాంతం చేశారు. ఈ వ్యవహారం లో గతంలోని పలువురు తహశీల్దార్లు, కలెక్టర్లు సహకరించినట్లు సమాచారం. వాస్తవానికి భూదాన్ యాక్ట్ నెంబర్ 13, 1965 ప్రకారం భూదాన్ భూములను కొనుగోలు చేయడానికి కానీ, విక్రయించడానికి కానీ వీలులేదు. భూదాన్ భూ ములు తీసుకున్నవారు.. తమతో పా టు తమ కుటుంబ సభ్యులు వ్యవసా యం చేసుకొని జీవించడానికి మాత్ర మే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. భూదాన్ యజ్ఞ బోర్డు ఈ భూములను రక్షించే బాధ్యతను కూడా చట్టం క ల్పించింది. అయితే స్థానిక రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కు మ్మక్కై పెద్ద ఎత్తున అన్యాక్రాంతానికి పాల్పడ్డారు. ఈ భూ కుంభకోణం వం దల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని చర్చ జరుగుతోంది.

ఎన్‌ఒసిలే కీలకం
భూదాన్ భూములను క్రయవిక్రయాలు చేయకూడదని చట్టం చెబుతుంటే ఆ భూములపై ఎన్‌ఒసిలు తీసుకొని ఏకంగా ధరణిలో రిజిష్టర్ చేసుకోవడం కొసమెరుపు. ఈ ఎన్‌ఒసిల జారీ వెనుక పెద్ద గూడుపుఠాణి నడిచినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్‌ఒసిలు ఇవ్వాలన్నా సిసిఎల్‌ఏ అనుమతితో తెలంగాణ భూయజ్ఞ బోర్డు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో ఎన్‌ఓసిలు ఎవరిచ్చారన్న దానిపై లోతుగా విచారణ జరగాల్సి ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు గతంలో పనిచేసిన ఒక కలెక్టర్ పాత్ర ఉన్నట్లు సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూదాన్ భూముల కుంభకోణంపై ఈడి, సిబిఐ విచారణ జరిగితే పూర్తి సమాచారం వెలుగులోకి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News