మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ముందుకు సోమవారం విద్యుత్ జేఏసీ నాయకుడు కె.రఘు హాజరయ్యారు. కమిషన్‌నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో తన వాం గ్మూలం ఇచ్చారు. ఈసందర్భంగా రఘును ఉద్దేశించి జస్టిస్ పీసీ ఘోష్ రఘు మాట్లాడుతూ మీ అఫిడవిట్‌లో పొందుపరిచిన సమాచారాన్ని, దా నితో జత చేసిన డాక్యుమెంట్లను సాక్ష్యాలుగా రి కార్డులోకి తీసుకుంటామని తెలియసేశారు. అం తే కాకుండా అఫిడవిట్‌లో పొందుపరచిన వివరాలు ఎక్కడి నుంచి సేకరించారు ? మీ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు వాస్తవమేనా ? వాటికి మీరు కట్టుబడి ఉన్నారా ? అని కమిషన్ ఆయన్ను ప్రశ్నించి నిర్ధారించుకుంది. తన అఫిడవిట్‌లోని అంశాలన్నీ ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి సేకరించనవిగా రఘు వెల్లడించారు. దాంతో కమిషన్ వేరే అంశాలు అడగలేదు.
మీడియా ముందు వాస్తవాలు వెల్లడి
విచారణ అనంతరం బయట విద్యుత్ జేఏసీ నేత కే.రఘు మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేత వి.ప్రకాష్ ఇటీవల కమిషన్ ముందు హాజరైన తర్వాత మీడియా ముందు తనపై చేసిన ఆరోపణలకు రఘు ఘాటుగా స్పందించారు. తాను(రఘు), వెదిరే శ్రీరామ్ లు కాళేశ్వరం కమిషన్ ను తప్పుదోవపట్టించామని వి.ప్రకాశ్ ఆరోపణలను ఆయన ఖండించారు. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు సీడబ్లూసీ తన లేఖలోనే చెప్పిందని రఘు వివరించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదనడం శుద్ధ అబద్ధమని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద మనకు 160 టీఎంసీలు అవసరం కాగా, 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా 165 టీఎంసీల లభ్యత ఉందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) 2015 మార్చి 4న లేఖ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
148 మీటర్లలో కట్టినా నీళ్లు తరలించవచ్చు…
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతోనే బ్యారేజ్‌ను అక్కడి నుంచి తరలించినట్టు ప్రకాశ్ చేసిన వాదనను రఘు తోసిపుచ్చారు. మహారాష్ట్ర ఒప్పుకున్న 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్‌ను నిర్మించిన అక్కడి నుంచి కేవలం 4 మీటర్ల మేర నీళ్లను ఎత్తిపోయడం లేదా కాలువ వెడల్పు, లోతు పెంచడం ద్వారా నీళ్లను తరలించవచ్చు అన్నారు. ఇది ఇంజనీరింగ్‌లో చాలా ప్రాథమిక అంశం అని, తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి బ్యారేజ్‌కి నీళ్లు గ్రావిటీగా వస్తాయని ఎవరూ అనలేదని రఘు చెప్పారు. తుమ్మడిహెట్టి నుంచి 19 మీటర్లుపైకి లిఫ్టు చేస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరేవని, మేడిగడ్డ నుంచి ఏకంగా 6 రేట్లు ఎక్కువగా 123 మీటర్లు ఎత్తిపోయాల్సి వస్తుందన్నారు. మేడిగడ్డతో విద్యుత్ ఖర్చులు ఆరింతలు పెరుగుతాయని, మేడిగడ్డ బ్యారేజ్ కట్టినా అక్కడి నుంచి ఎల్లంపల్లి వరకు ఎలాంటి ఆయకట్టు లేకపోవడంతో ప్రత్యేక ప్రయోజనం లేదని వివరించారు.
నామినేషన్లపై అదనపు టీఎంసీ పనులు..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాలు సరైనవి కావని సీడబ్ల్యూసీ తన నివేదికలో ఆధారాలతో సహా చూపించిదని రఘు తెలిపారు. పంపు హౌజ్‌లను తక్కువ ఎత్తులో నిర్మించడంతో ముంపు ప్రమాదం ఉంటుందని స్పష్టంగా రాసిందని, నీటి నిల్వల కోసం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినట్టు వాదిస్తున్నారని, బ్యారేజ్‌లను నీటి మళ్లింపు కోసం నిర్మిస్తానూ రాపీ. నిల్వ కోసం కాదని విద్యుత్ రఘు తప్పుబట్టారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.