Wednesday, January 22, 2025

కేజ్రీ పాత్రపై దర్యాప్తు సాగుతోంది

- Advertisement -
- Advertisement -

ఇతర నిందితులపై దర్యాప్తు పూర్తి
ఎక్సైజ్ పాలసీ కేసులో కోర్టుకు సిబిఐ వెల్లడి

న్యూఢిల్లీ : ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పాత్రపై మాత్రమే ఇంకా దర్యాప్తు సాగుతోందని, తక్కిన నిందితుల పాత్రపై దర్యాప్తు పూర్తి అయిందని సిబిఐ శనివారం కోర్టుకు తెలియజేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు దారి తీసిన జూన్ 4 తరువాతి పరిణామాలు కొన్నింటి గురించి తాము సుప్రీం కోర్టుకు వివరిస్తామని కూడా సిబిఐ న్యాయవాది డిపి సింగ్ తెలిపారు. ఇంతకు ముందు సొలిసిటర్‌జనరల్ చేసిన ప్రకటన ఈ కేసులో కేజ్రీవాల్ మినహా తక్కిన నిందితులకు సంబంధించినదని కూడా సిబిఐ వివరించింది. ఇది ఇలా ఉండగా, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా, ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 15 వరకు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా శనివారం పొడిగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News