Saturday, January 18, 2025

ఇన్వెస్టిగేషన్, స్టింగ్ ఆపరేషన్‌తో

- Advertisement -
- Advertisement -

కేతిక హన్మయశ్రీ సమర్పణలో యు.కె. ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ శంకర్, మహేష్ యడ్లపల్లి, ఆయూషి పటేల్, అనుశ్రీ లీడ్ రోల్స్‌లో పవన్ శంకర్ దర్శకత్వంలో పల్లపు ఉదయ్ కుమార్ నిర్మిస్తు చిత్రం ‘విశాలాక్షి’. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను వీరశంకర్, రాజ్‌కందుకూరి, ప్రతాని రామకృష్ణగౌడ్‌లు సంయుక్తంగా లాంచ్ చేశారు.

అనంతరం దర్శకుడు పవన్ శంకర్ మాట్లాడుతూ “ఇందులో 5 పాటలు, 5 ఫైట్‌లు ఉంటాయి. మొత్తం 4 షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం. టాకీ మొత్తం రాయలసీమ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. పాటలను ఊటీ, అరకుల్లో చిత్రీకరించటానికి ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు. నిర్మాత పల్లపు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ “ఈ కథ ఇన్వెస్టిగేషన్, స్ట్రింగ్ ఆపరేషన్, ఎమోషనల్ వంటి అన్ని అంశాలతో కూడుకున్నది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కథను మలిచాము”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోలు విజయ్ శంకర్, మహేష్ యడ్లపల్లి, హీరోయిన్‌లు ఆయూషి పటేల్, అనుశ్రీలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News