Monday, December 23, 2024

తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఎపికి రూ. 886 కోట్లు కేటాయించారని మంత్రి అశ్వినీవైష్ణవ్ తెలిపారు. ప్రస్తుత బడ్జెట్ లో రూ. 9138 కోట్లు ఒక్క ఎపికే కేటాయించారని చెప్పారు. ఎపిలో ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 98 శాతం ఆంధ్రప్రదేశ్ లో విద్యుద్దీకరణ పూర్తి అయిందన్నారు. ప్రస్తుత బడ్జెట్ లో తెలంగాణలో రైల్వే కోసం రూ. 5071 కోట్లు కేటాయించారు. తెలంగాణలో 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయింది. తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని ఆయన వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News