Saturday, January 18, 2025

గోల్డెన్ చాన్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆధ్వర్యంలోని సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ జూన్ 19 నుండి ప్రారంభం కానుంది. దీనిలో ఈ నెల 23 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సోమవారం ప్రారంభం కానున్న సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జిబి) స్కీమ్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుపై 50 తగ్గింపు పొందవచ్చు. సావరిన్ గోల్ బాండ్లలో పెట్టుబడి అంటే, 24 క్యారెట్( 99.9 శాతం) స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. ఎస్‌జిబిలలో పెట్టుబడి సంవత్సరానికి 2.50 శాతం వడ్డీని పొందుతుంది.

డబ్బు అవసరమైతే, బాండ్‌పై రుణం కూడా తీసుకోవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్(ఐబిజెఎ) ధరల ఆధారంగా బాండ్ ధర నిర్ణయిస్తారు. దీనిలో సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి మూడు రోజుల రేటు సగటు ఆధారంగా రేటు ఖరారు చేస్తారు. ఎస్‌జిబి రెండో సిరీస్ సెప్టెంబర్ 11న ప్రారంభమై, 15 వరకు ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ అనేది ప్రభుత్వ బాండ్, దీన్ని డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవచ్చు.

బాండ్ విలువ ఐదు గ్రాముల బంగారం ఉంటుంది. దీనిని ఆర్‌బిఐ జారీ చేస్తుంది. ఎస్‌జిబిలలో స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ( ఎన్‌ఎస్‌ఇ) ప్రకారం, ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ( ఐబిజెఎ) ఆధారంగా 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారం ధరతో గోల్ బాండ్ ధర అనుసంధానం చేస్తారు. దీనితో పాటు డీమ్యాట్ రూపంలో మార్చుకోవచ్చు. ఇది చాలా సురక్షితమైనది, అదనంగా ఎలాంటి ఖర్చు ఉండదు.

4 కిలోల వరకు పెట్టుబడి పెట్టవచ్చు
ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము, గరిష్టంగా 4 కిలోల బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ హోల్డింగ్ విషయంలో 4 కిలోల పెట్టుబడి పరిమితి మొదటి దరఖాస్తుదారుకు మాత్రమే వర్తిస్తుంది. అదే సమయంలో ట్రస్ట్ కోసం గరిష్ట కొనుగోలు పరిమితి 20 కిలోలు ఉంటుంది

8 సంవత్సరాల ముందు విత్‌డ్రా చేస్తే
సావరిన్ గోల్డ్ బాండ్ 8 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కల్గివుంటుంది. ఆ తర్వాత దాని నుండి వచ్చే లాభంపై పన్ను లేదు. మరోవైపు 5 సంవత్సరాల తర్వాత అంటే కొంత ముందుగా డబ్బును విత్‌డ్రా చేసుకుంటే, దీని నుండి వచ్చే లాభం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ( ఎల్‌టిసిజి) రూపంలో 20.80 శాతం పన్ను విధిస్తారు.

ఆఫ్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు
పెట్టుబడి పెట్టడానికి ఆర్‌బిఐ అనేక ఎంపికలను ఇచ్చింది. బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సిఐఎల్) ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. పెట్టుబడిదారు దరఖాస్తు ఫామ్‌ను పూరించిన తర్వాత మీ ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది. ఈ బాండ్‌లు మీ డీమ్యాట్ ఖాతాకు బదిలీ చేస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు పాన్ తప్పనిసరి, బాండ్లను అన్ని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సిఐఎల్), గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఇ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (బిఎస్‌ఇ) ద్వారా విక్రయిస్తారు.

మంచి రాబడి, సురక్షితం
బంగారంపై దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం సరైనదేనని, హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదని, సరైన రాబడులు వస్తాయని కేడియా కమోడిటీ డైరెక్టర్ అజయ్ కేడియా చెబుతున్నారు. కనీసం 3 నుండి 5 సంవత్సరాల వరకు బంగారంలో పెట్టుబడి మంచి రాబడిని ఇస్తుంది. రాబోయే 1 సంవత్సరం గురించి మాట్లాడితే, బంగారం 65 వేల వరకు వెళ్లవచ్చు. ఎస్‌జిబి ఎంతో సురక్షితమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News