Friday, November 22, 2024

పెట్టుబడుల పేరుతో మోసాలు

- Advertisement -
- Advertisement -

చైనా, దుబాయ్ కేంద్రంగా ఛీటింగ్
రూ.712కోట్లు కొట్టేసిన నేరస్థులు
15,000మంది బాధితులు, టెలీగ్రాం, వాట్సాప్ వేదికగా నేరాలు
క్రిప్టోలోకి మార్చి విదేశాలకు తరలింపు
9మందిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్
ఫొటోః గేమ్ పేరుతో ఉంది…

మనతెలంగాణ, సిటిబ్యూరోః పెట్టుబడుల పేరుతో మోసాలు చేస్తున్న తొమ్మిది మంది సైబర్ నేరస్థులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ కార్డులు, చైనా కరెన్సీ, బ్యాంక్‌చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ టిఎస్‌ఐసిసిసిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముంబాయి, అహ్మదాబాద్, హైదరాబాద్‌కు చెందిన ప్రకాష్ ముల్‌చంద్‌బాయి ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, నయిముద్దిన్ వాహీదుద్దిన్ షేక్, గగన్ కుమార్‌సోని, పర్వేజ్, అలియాస్ గుడ్డు, శంషీర్ ఖాన్, మహ్మద్ మునావర్, షా సుమైర్, అరుల్ దాస్‌ను అరెస్టు చేశారు.

Also Read: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మనీష్, వికాష్ , రాజేష్ పరారీలో ఉన్నారు. నిందితులు టెలిగ్రాం, వాట్సా ద్వారా మెసేజ్‌ల పంపిస్తూ మోసాలు చేస్తున్నారు. చిక్కడపల్లికి చెందిన బాధితుడు శివకుమార్ వీరి వలలో చిక్కి రూ.28లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడికి నిందితులు ఓ టాస్క్ ఇచ్చారు. తాము చెప్పిన టెలిగ్రాం లింక్ ద్వారా గేమ్ ఆడాలని, రేటింగ్ ఇవ్వాలని చెప్పారు. ఇలా చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు, దీంతో బాధితుడు వారు చెప్పినట్లు చేశాడు. ముందుగా రూ.1,000 పెట్టుబడిపెట్టి గేమ్ ఆడిన తర్వాత నిందితులు రూ.866 లాభం పొందారని చెప్పారు. వాటిని బాధితుడికి వాలెట్‌లోని విండోలో కన్పించే విధంగా చేశారు.

ఇలా దశల వారీగా బాధితుడికి టాస్క్‌లు ఇవ్వడంతో వారు చెప్పిన వాలెట్‌లో డబ్బులు లోడ్ చేసి టాస్క్‌లు చేశాడు. చివరికి రూ.17లక్షలు సంపాదించారని చెప్పారు, కానీ వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. మరిన్ని టాస్క్‌లు చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని చెప్పడంతో దశల వారీగా రూ.28లక్షలు పెట్టాడు, అయినా కూడా వారు డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన బాధితుడి డబ్బులు హైదరాబాద్‌కు చెందిన రాధికా మర్చట్ అనే కంపెనీకి చెందిన ఆరు కంపెనీలోకి వెళ్లినట్లు గుర్తించి హైదరాబాద్‌లో ఆపరేట్ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. ఇలాంటి బాధితులు దాదాపుగా 15,000మంది ఉన్నారు. బాధితుల్లో సంపన్నులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

గేమ్ రూపకర్తలు చైనీయులు

చైన్‌కు చెందిన నిందితులు ప్రధాన నిందితులు లీలూ గౌంగోజ్, నాన్ యే కెవిన్ జున్ ఆన్‌లైన్ గేమ్‌లను రూపొందిస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్‌ను రూపొందించి ఇండియన్ల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ గేమ్‌ను నిర్వహించేందుకు ఏజెంట్లుగా దుబాయ్‌లో ఉంటున్న ఇండియాకు చెందిన ఆరిఫ్, అనాస్, ఖాన్ బాయ్, పియూష్, శైలేష్ నడిపిస్తున్నారు. వీరు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మనీస్, వికాష్ , రాజేష్ ద్వారా ఇండియాలో నిర్వహిస్తున్నారు. వీరికి హైదరాబాద్‌కు చెందిన ఎండి మునావార్, అరుల్‌దాస్, షాసుమీర్, షమీర్ ఖాన్ హైదరాబాద్‌లో ఉండి వారి తరఫున నిర్వహిస్తున్నారు. మనీస్, వికాష్ , రాజేష్ ఇండియాకు చెందిన బ్యాంక్‌ల్లో 33 షెల్ కంపెనీలు,65 బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేసి వాటిని కుమార్ ప్రజాపతి, ప్రకాష్ ప్రజాపతికి విక్రయించారు.

ప్రజాపతి ఈ బ్యాంక్ ఖాతాల్లోకి ఇక్కడ దోచుకున్న డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. దీనికి గాను వీరికి 2–3శాతం కమీషన్ ఇస్తున్నారు. దుబాయ్‌లో ఉంటున్న నిందితులు అక్కడి సిమ్ కార్డులను ఉపయోగించి ఇక్కడ ఉంటున్న బాధితులకు పార్ట్‌టైం జాబ్స్, టాస్క్‌ల పేరుతో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి కొట్టేసిన డబ్బులను క్రిప్టో కరెన్సీ(యూఎస్‌డిటీ)లోకి మార్చి నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు, వాటిని చైనా, దుబాయ్‌లో విత్‌డ్రా చేస్తున్నారు. కొన్ని డబ్బులను హవాలా ద్వారా తీసుకుని ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేసి తరలిస్తున్నారు.

కొట్టేసిన డబ్బులు తీవ్రవాదుల చేతుల్లోకి…

క్రిప్టోలోకి మార్చిన ఇండియన్ రూపాయలను కొందరు నిందితుల ద్వారా హిజ్బుల్ టెర్రరిస్టు సంస్థలో వెళ్లినట్లు పోలీసులకు ఆధారాల లభ్యమయ్యాయి. ఈ విషయాని ఎన్‌ఐఏకు సమాచారం ఇచ్చామని హైదరాబాద్ సిపి చెప్పారు. వాళ్లు ఈ కేసును దర్యాప్తు చేస్తారని తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News