Monday, January 20, 2025

ఫార్మాలోకి పెట్టుబడుల పరంపర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఫార్మా రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఒకేరోజు రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కోర్నింగ్, ఎస్‌జీడీ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. రూ.500 కోట్లకుపైగా పెట్టుబడులు పె ట్టేందుకు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ సామగ్రి ఉత్పత్తిలో పెట్టుబడు లు పెట్టనున్నాయి. బయో ఏషియా సదస్సులో రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారక రామారావుతో స మావేశం అనంతరం విషయాన్ని ఫార్మా సంస్థలు ప్రకటించాయి. ప్రైమరీ ప్యాకేజింగ్ సరఫరా గొలుసును సురక్షితం చేయడం ద్వారా తెలంగాణలో ఫార్మా పరిశ్రమను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో భాగ్యసామ్యం కలిగి ఉన్నందుకు తాము గర్విస్తున్నామని ఎస్‌జిడి ఫార్మా ఎండి అక్షయ్ సింగ్ అన్నారు.

దాదాపు రూ.500 కోట్లతో ఉద్దేశించిన ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 150 శాశ్వత ఉ ద్యోగాలు, 300 కంటే ఎక్కువ మందికి పరోక్షంగా ఉ పాధి లభించనున్నదని పేర్కొన్నారు. 2024లో వాణి జ్య ఉత్పత్తిని ప్రారంభిస్తామని, ఎస్‌ఈడి ఫార్మా సహకారంతో తెలంగాణలో సం తోషిస్తున్నామని కోర్నింగ్ సంస్థ ఎండి సుధీర్ పిళ్లై పే ర్కొన్నారు. ఫార్మా స్యూటికల్ ప్యాకేజింగ్ నాణ్యతను మెరుగుపరుస్తూనే కిష్టమైన ఔషధాల పంపిణీని వేగవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఫార్చ్యూ న్ 500 కంపెనీ అయిన కోర్నింగ్ – ఎస్‌ఈడి ఫార్మా ప్రపంచ స్థాయి ఫెసిలిటీని ఏర్పాటు చేయనుండడంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

* ఫాక్స్ లైఫ్ సైన్సెస్ రూ. 200 కోట్లు పెట్టుబడి..
ఔషధాల తయారీకి ఫార్మాస్యూటికల్ సింగిల్ యూజ్ టెక్నాలజీ (ఎస్‌యూటి)లో సామర్థ్యాలను విస్తరించేందుకు తెలంగాణలో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెరికాకు చెందిన ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ప్రకటించింది. తక్కువ ఖర్చుతో కస్టమ్ మెడికల్, ఎస్‌యూటీ ఫార్మాలో వినియోగదారులకు మద్దతు ఇచ్చేందుకు ప్రపంచ స్థాయి ఫెసిలిటీని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏక్నాథ్ కులకర్ణి పేర్కొన్నారు. గతేడాది మే నెలలో యుకె పర్యటనలో భాగంగా ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్‌తో సమావేశమయ్యారు. రానున్న మూడేళ్లలో యుఎస్‌డి 3 మిలియన్లు పెట్టుబడి పెట్టడానికి కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది.

తాజాగా బయో ఏసియా సదస్సులో పాల్గొన్న కంపెనీ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌తో ఆదివారం సమావేశమై తమ విస్తరణ ప్రణాళికలను ఆయనకు వివరించారు. హైదరాబాద్‌లో పార్టికల్ క్యారెక్టరైజేషన్ లేబొరేటరీలను ప్రారంభించినందుకు ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, అతని బృందాన్ని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలో ఈ సంస్థ తమ మొదటి అంతర్జాతీయ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నది. గొట్టాలు, బ్యాగ్, బాటిల్, ఫ్లాస్క్, కార్బాయ్ అసెంబ్లీలు, ఫిల్ట్రేషన్, ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్, లేబొరేటరీ సేఫ్టీ ప్రొడక్ట్, ప్లాస్టిక్ ల్యాబ్‌వేర్, ట్యూబింగ్, గ్యాస్‌కెట్‌లు, గొట్టాలు, స్టెయిన్‌లెస్ స్టీల్, గ్లాస్‌వేర్‌లతో సహా కస్టమ్ సింగిల్-యూజ్ సిస్టమ్స్ (ఎస్‌యుఎస్)లో ప్రైవేట్‌గా ప్రపంచ అగ్రగామి. పరిశోధన, బయోటెక్ మరియు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నది.

వైద్య పరికరాల సంస్థల ప్రతినిధులతో కెటిఆర్ భేటీ

రాష్ట్రంలో ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మెడికల్ డివైస్ కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సదస్సుకు హాజరైన వారిలో ఎంపిక చేసిన 20 మంది వైద్య పరికరాల కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌కు మంత్రి అధ్యక్షత వహించారు. భారత్‌లో వైద్య పరికరాల ఆవిష్కరణ, స్వదేశీకరణ, తయారీని మరింత వేగవంతం చేయడానికి విధాన నిర్ణయాలపై చర్చించారు. ప్రపంచ అభివృద్ధి కార్యకలాపాలలో మెడ్‌టెక్ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు, ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌లలో దిద్దుబాట్లు, అధిక జిఎస్‌టి చిక్కులు, లభ్యతలో సవాళ్లు, ముడిసరుకు నిల్వలు వంటి పలు సూచనలను పరిశ్రమ ప్రతినిధులు సమావేశంలో వెల్లడించారు.

రాష్ట్రంలో ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన విధాన మార్పులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మెడ్‌ట్రానిక్ ఇండియా ఎండి మైఖేల్ బ్లాక్‌వెల్, హిందుస్థాన్ సిరింజెస్ ఎండి రాజీవ్ నాథ్, బి. బ్రౌన్ మెడికల్ ఎండి ఆదిత్య బెనర్జీ,టెరుమో ఇండియా ఎండి శిశిర్ అగర్వాల్, సచిన్ గార్గ్, జతిన్ మహాజన్, పానాసియా ఎండి జివిఎస్ మన్యం, అభినవ్ ఠాకూర్, కిషోర్ ఖన్నా, జోస్ పాల్, డాక్టర్ సనివ్ రెలాన్, చిరాగ్ జోషి, రాజీవ్ ఛబ్రా, డాక్టర్ రాజేష్ తుముర్రు, డాక్టర్ కుల్దీప్ రైజాదా,డాక్టర్ టి. ప్రదీప్ రెడ్డి, శశీర్ కుమార్ మున్పల్లి, డాక్టర్ ఎవిఎస్ రెడ్డి, జోన్ ఆండర్సన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News