హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో మాంద్యం నెలకొన్నా ఆ ప్రభా వం ఏ మాత్రం కనిపించడం లేదు. ఇందు కు దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు వరదే నిదర్శనం. తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా అనేక అం తర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సముఖతను వ్యక్తం చే స్తున్నారు. ఇందులో భాగంగా ఐటి రంగం లో అగ్రశ్రేణి సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ నగరంలో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించాలని నిర్ణయించిం ది. ఈ నేపథ్యంలో కొత్తగా రూ. 16 కోట్లతో మూడు డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పా టు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో 3 డేటా సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం (2022)లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ తాజాగా మరో 3డేటా సెంటర్‌లను ప్రారంభిస్తామని వెల్లడించింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ మొత్తంగా ఆరు డేటా సెంటర్‌లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే పది-, పదిహేను సంవత్సరకాలంలో ఈ ఆరు డేటా సెంటర్ లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్ లక్ష్యంలో భాగంగా భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు సంస్థ పేర్కొన్నది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సలో రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందన్నారు.
నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో కలిసి పని చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు డేటాసెంటర్‌లు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంతో మైక్రోసాఫ్ట్ అనుబంధం అద్భుతంగా కొనసాగుతుందని ఆ సంస్థ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్ లో హైదరాబాదే కీలకమన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటాసెంటర్‌లు కీలకంగా మారుతాయన్నారు.
150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీకి అవసరయ్యే సాఫ్ట్‌వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న వెబ్‌పిటి సంస్థ హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ (జిసిసి)ను సుమారు 150 కోట్లతో ఏర్పాటు చేయనుంది. కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగులకు మరింత మెరుగైన పద్దతుల్లో రీహాబిలిటేషన్ థెరపీని అందించడానికి వైద్య సంస్థలకు అవసరమయ్యే ఎండ్ టు ఎండ్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్‌ను వెబ్‌పిటి సాఫ్ట్‌వేర్ సంస్థ అంది స్తోంది. జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వెబ్‌పిటి సిఇఒ ఆష్లే గ్లోవర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ షుగా, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, సిఇఒ సందీప్ శర్మ తదితరులు మంత్రి కెటిఆర్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్‌తో సమావేశయ్యారు.
ఈ సందర్భంగా వెబ్‌పిటి సంస్థ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో నెలకొల్పనున్న తమ విస్తరణ (జిసిసి సెంటర్) ప్రణాళికలపై చర్చించారు. 2008లో అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా ప్రారంభమైన తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ యేటా పెరుగుతుందని వివరించారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, వెబ్‌పిటి సంస్థ జిసిసి సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ముందుకు రావడంప్లై హర్షం వ్యక్తం చేశారు. సంస్థ యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. వెబ్‌పిటి విజయాల్లో ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని హామి ఇచ్చారు.
నగరంలో గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్
హైదరాబాద్ నగరంలో గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ రానుంది. ఈ సంస్థ ఇన్‌స్పైర్‌బ్రాండ్స్ పేరిట త్వరలోనే నగరంలో తన సపోర్టు సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం నాలుగు వర్టికల్స్‌లో ఈ సంస్థ సపోర్టు చేయనుంది. ఇందులో ప్రధానంగా ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌మెంట్, రెస్టారెంట్ టెక్, డిజిటల్ టెక్‌తో పాటు ఎంటర్ ప్రైజ్ డేటాను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ అంగీకరించినట్లు దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.