- Advertisement -
1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్
ముంబై: వరుసగా ఐదు రోజులుగా మార్కెట్ సూచీలు పడిపోతూ వచ్చాయి. నేడు కూడా భారీగా పడిపోయాయి. లోక్ సభ ఎన్నికలు, క్రూడాయిల్ పెరుగుదల, ఇతర కారణాలు మార్కెట్ ను పడగొట్టాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1046.65 పాయింట్లు లేక 1.42 శాతం పతనమై 72419.74 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 335.41 పాయింట్లు లేక 1.50 శాతం పతనమై 21967.10 వద్ద ముగిసింది.
నిఫ్టీలో ప్రధానంగా హిరోమోటోకార్పొ, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఎస్ బిఐ లాభపడగా, నష్టపోయిన షేర్లలో ఎల్ అండ్ టి, బిపిసిఎల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా లి. ఉన్నాయి.
- Advertisement -