- Advertisement -
కొప్పల్ (కర్ణాటక): అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్ఠకు ఇప్పటివరకు తనకు ఆహ్వానం అందలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య చెప్పారు. ఆహ్వానం అందిన తరువాత దీనిపై ఆలోచిస్తానన్నారు. ఆహ్వానం అందినదా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి వెళ్లేదీ లేనిదీ సరైన సమయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు శుక్రవారం కాంగ్రెస్ తెలియజేసింది.
- Advertisement -