Sunday, January 19, 2025

సింగపూర్ బోనాలకు రండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సింగపూర్‌లోని లష్కర్ బోనాలకు రండంటూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్‌లకు ఆహ్వానం అందింది. సింగపూర్ పర్యటనలో ఉన్న వీరిని ఈ మేరకు గురువారం తెలంగాణ సింగపూరు కల్చరల్ సొసైటీ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింగపూరులో నిర్వహించనున్న లష్కర్ బోనాలకు రండని వారిని ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి కోసం తెలంగాణ నుండి విదేశాలకు వలస వచ్చి ఎందరో తమ సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారన్నారు.

సింగపూర్‌లోని తెలంగాణ ప్రజలను, అందుకు కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు కల్చరల్ సొసైటీ ప్రతినిధులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. సింగపూర్‌లోని తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్న లష్కర్ బోనాలకు వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నుండి కళాకారులను పంపిస్తామని మంత్రి ర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. సింగపూర్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందిస్తూ విదేశాల్లోనూ లష్కర్ బోనాలను ఘనంగా నిర్వహించటాన్ని ఆయన ప్రోత్సహించారు. అనంతరం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు ఖండాలు దాటినా.. తమ సంస్కృతిని ఆచార వ్యవహారాలను కొనసాగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలు తమ సాంస్కృతి , సాంప్రదాయాలను స్వేచ్ఛగా జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం సింగపూరు కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ నేతృత్వంలో పలు సంస్థలు మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం గతంలోనే ఏర్పడి ఉంటే తమ భవిష్యత్తు ఎంతో బాగుండేదని, ఉద్యోగం, ఉపాధి కోసం ఇంత దూరం ఇతర దేశాలకు వచ్చేవారమే కాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News