Tuesday, November 5, 2024

వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,హైదరాబాద్ : నగరంలోని గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నిర్వహించే వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో చేరేందుకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ది శాఖా అధికారి పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు 4వతరగతి ఉత్తీర్ణులై 5వ తరగతి చదువుతున్న బాలబాలికలు రెండు పాస్‌పోర్ట్‌సైజు పోటోలు, బోనఫైడ్, ఆధార్ కార్డు జీరాక్స్ పత్రాలతో ఈనెల 23వ తేదీలోగా గిరిజన అభివృద్ది కార్యాలయం బాపూజీనగర్, నందు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఇందులో కాయాకింగ్, కెనోయింగ్, సెయిలింగ్ శిక్షణ ఉంటుందని, ప్రవేశానికి విద్యార్థుల ఎత్తు, బరువు, వర్టికల్ జంప్, మెడిసిన్ బాల్ త్రో 30 మీ. ప్లయింగ్ స్టార్ట్, ప్లెక్సి బిలిటి టెస్ట్ 800మీ పరుగు పందెం పోటీలు నిర్వహించబడుతాయని చెప్పారు. ప్రతిభ ఆధారంగా 5వ తరగతిలో 10మంది బాలికలకు, 10 మంది బాలురకు ప్రవేశాలు కల్పిస్తామని, ఐటిడిఐ మైదాన ప్రాంత జిల్లాలకు సంబంధించిన బాల బాలికలు అర్హులని తెలిపారు. వాటర్ స్పోర్ట్స్ పాఠశాలలో బాల బాలికలకు ప్రత్యేక ఆహారం, వసతి, స్పోర్ట్స్ దుస్తులు, షూస్ ఇస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News