మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర సాయుధ బలగాలు బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఎస్‌ఎస్‌బి, ఎస్‌ఎస్‌ఎఫ్ లలో కానిస్టేబుల్ పోస్టులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 24,369 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోడానికి ఈ నెల 30 ఆఖరు తేది. జనవరి, 2023లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.
అయితే రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు గాను బిసి స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు కేంద్ర సాయుధ ధళాల కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె. అలోక్ కుమార్ సూచించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://ssc.nic.in ను సందర్శించాలని కోరారు.
అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన బోర్ట్ నుంచి 0వ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 170 సె.మీ లకు తగ్గకూడదు. మహిళా అభ్యర్థులకైతే.. 157 సెం.మీలకు తగ్గకూడదు.
వయో పరిమితి:
జనవరి 01, 2023 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.