Wednesday, January 22, 2025

న్యాయశాస్త్ర పరిపాలనలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: న్యాయ శాస్త్ర పరిపాలనలో శిక్షణకు సెడ్యూల్ కులాలకు చెందిన న్యాయశాస్త్ర పట్టభధ్రులైన యువతీ యువకుల నుండి దరఖాస్థులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు అఖిలేష్ రెడ్డి అన్నారు. షెడ్యూల్ కులాలకు చెందిన న్యాయశాస్త్ర పట్టభధ్రులైన యువతీ యువకులకు జిల్లాలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్,గవర్నమెంట్ ఫ్లీడర్‌ల వద్ద జూనియర్‌గా చేర్పించి మూడు సంవత్సరాల న్యాయ శాస్త్ర పరిపాలనలో స్టయిఫండ్‌తో కూడిన శిక్షణ ఇప్పించామన్నారు. 2023/24సంవత్సరానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్‌సి అభ్యర్థుల కోసం 8సీట్లు కేటాయించినట్లు పేర్కోన్నారు.

అభ్యర్థులు న్యాయశాస్త్రంలో పట్టభధ్రులై ఉండాలని వార్షిక ఆదాయము రెండు లక్షల రుపాయలకు మించరాదన్నారు. అభ్యర్థులు కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలతో డిగ్రీ న్యాయశాస్త్ర విద్య పట్టాలతో బార్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఆధార్‌కార్డు ,రేషన్ కార్డు జిరాక్స్‌లతో ఆన్‌లైన్‌లో telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తులు చేయాలన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News