Thursday, January 23, 2025

ఐటిఐలో దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలో ఎన్‌సీవీటి కోర్సుల యందు ప్రవేశాలకు రెండవ విడత దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్, కన్వీనర్ వివి సుబ్బలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 12 నుండి 31 తేది వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు వీలైయినన్ని ఎక్కువ ట్రేడుల యందు ఆష్షన్స్ పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటిఐలో ఉన్న కోర్సులు ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాప్ట్‌మెన్ సివిల్, కోపా కంప్యూటర్, మెకానిక్ డిజిల్ ఉన్నాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News