- Advertisement -
వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, జనరల్ ఆసుపత్రుల్లో మొత్తం 894 మెడికల్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గాంధీ, ఉస్మానియాతో పాటు వివిధ జిల్లాల్లోని మెడికల్ కళాశాలలు, ఆసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 573, ట్యూటర్లు 40, ఫార్మసిస్టులు 79, ల్యాబ్ అసిస్టెంట్లు 202 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ పోస్టలకు ఎంపిక చేస్తారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- Advertisement -