హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు గల సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో యువతి, యువకులు, ఉద్యోగస్తులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో అధిక డిమాండ్ ఉందన్నారు. ఐటీరంగంలో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, పెనైట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ అర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ సిస్టమ్స్ అడ్మినిస్టేటర్ మొదలగు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ డిగ్రీ, పీజి, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ డిప్లోమా చేసిన వారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లోమా, పోస్ట్ డిప్లోమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కోర్సులు చేయడానికి అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు మార్చి 18 లోపు…సెల్ 7893141797 నంబర్‌కు సంప్రదించవచ్చు, లేదా ఆన్లైన్ లో www.nacsindia.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Invitation to apply for Cyber Security Courses