మనతెలంగాణ/కోరుట్ల టౌన్: తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్చంద సేవా సంస్థ అందించే ఉగాది పురస్కారాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రకాలైన సాహిత్యం, కళా రంగాల్లో నిష్ణాతులైన వారు మార్చి 5వ తేది లోపు ధరఖాస్తు చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు పోలోజి రాజ్‌కుమార్, సంస్థ సలహాదారు కటుకం రాజేంద్రప్రసాద్‌లు పేర్కోన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వివిధ రంగాల్లో అత్య్ంత ప్రతిభను ప్రదర్శించిన కళాకారులు, కవులు, సామాజిక సేవకులు ఈ ఉగాది పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రి, అవధానం, వైద్యం ఇంద్రజాలం, హరికథ,బుర్రకధ, సామాజిక సేవ, మూకాభినయం మొదలైన అంశాలతో పాటూ ఇతర సేవా రంగాలకు కూడా ఈపురస్కారాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు మార్చి5లోపు 9502184063, 9100174351 నంబర్లకు సంప్రదించాలని ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం మార్చి 27న ఆదివారం వరంగల్‌లో జరుగుతాయని తెలిపారు.
ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
- Advertisement -