Friday, November 15, 2024

కెటిఆర్‌కు మళ్లీ దావోస్ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Invitation to Minister KTR for WEF Annual Meeting

తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగణ్య టెక్నాలజీ పవర్ హౌజ్‌గా మార్చారని మంత్రి కెటిఆర్‌ను ప్రశంసించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె
కొవిడ్19 సంక్షోభం తర్వాత వినూత్న టెక్నాలజీలు, విధానాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం చేపట్టిన కారక్రమాలపై అనుభవాలను వచ్చే జనవరి 1721 మధ్య దావోస్‌లో జరిగే సమావేశంలో పంచుకోవాలని కెటిఆర్‌ను కోరుతూ ఆహ్వానించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ఆర్ధిక ఫోరం నిర్వహించే వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం లభించింది.వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు దావోస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఆహ్వానం పంపిన సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రాండె, మంత్రి కెటిఆర్‌ను ప్రశంసలతో ముంచెతారు.

కెటిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఒక అగ్రగణ్య టెక్నాలజీ పవర్ హౌస్ రాష్ట్రంగా మారిందని బోర్గ్ బ్రాండే వ్యాఖ్యానించారు. ప్రధానంగా కోవిడ్…-19 సంక్షోభం తర్వాత వినూత్నమైన టెక్నాలజీలు, విధానాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమలపైన మంత్రి కెటిఆర్ తన అనుభవాలను పంచుకోవాలని ఆ ఆహ్వానంలో ఆయన కోరారు. దీంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీలను సామాన్య మానవుల ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపైన కూడా తన అభిప్రాయాలను తెలపాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు కెటిఆర్‌ను కోరారు.

ప్రపంచంలోని రాజకీయ, వ్యాపార, పౌర సమాజ నాయకులు ఉమ్మడిగా ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభాన్ని నివారించడంపైన కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రయత్నిద్దామని మంత్రి కెటిఆర్‌కు పంపిన ఆహ్వానంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది.

కాగా ఈఆహ్వానం తెలంగాణ రాష్ట్రం చేపట్టిన వినూత్న విధానాలకు ప్రగతి ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఆహ్వానంపైన హర్షం వ్యక్తం చేసిన చేసిన ఆయన రాష్ట్రం ఐటి,ఇన్నోవేషన్, ఇండస్ట్రీ రంగాల్లోలో చేపట్టిన కార్యక్రమాలకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. ఈ ఫోరం వేదికగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ప్రపంచ దిగ్గజాలకు తెలియజేసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సంబంధిత విషయాలతో పాటు కరోనా తర్వాత ఎదురయ్యే సామాజిక, సాంకేతిక సవాళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో జరుగనున్న సదస్సులో వివిధ దేశాల నేతలు, పలు కంపెనీల సిఇఒలు, ఛైర్మన్లు, ప్రపంచస్థాయి సంస్థల అధిపతులు పాల్గొననున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News