సంగారెడ్డి: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 11న తెలంగాణ సాహిత్య దినత్సోవాన్నీ పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే కవి సమ్మేళనానికి జిల్లాలోని కవులను ఆహ్వానిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. ఆసక్తి కలిగిన కవులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు తమ స్వీయ కవితలను ఉత్తమ కవితల ఎంపిక కోసం ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కవితలు ఉండాలన్నారు. కవితలు తెలుగు, హిందీ ఉర్దూ భాషల్లో ఉండవచ్చన్నారు. ఈ కవితలు ఏ పత్రికలో గానీ ఇతర మాధ్యమాల్లో గాని ప్రచురించబడలేదని, కాపీ చేసినవి కాదని, తమ స్వీయ కవితలని ధృవీకరించాలని పేర్కొన్నారు.
ఆసక్తి గల ఉన్న కవులు సాహిత్య అ భిమానులు కవి సమ్మేళనంలో పాల్గొనుటకు తమ కవితలను ఈ నెల 8 లోగా 15 వరుసలకు మించకుండా కవితలు రాసి వ్యక్తిగత వివరాలను తెలియజే స్తూ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించి పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఫోన్ నెంబర్ 99 63423691లో సంప్రదించాలని కలెక్టర్ సోమవారం ప్రకటనలో కోరారు.