Saturday, November 16, 2024

చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల… కుమారుడి పెళ్లికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ నేత, జగన్ సోదరి వైఎస్ షర్మిల కలిశారు.  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు ఇంటికి శనివారం వెళ్లి తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక ఇచ్చి చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసమేనని, రాజకీయ కోణంలో చూడొద్దని, రాజకీయ కోణంలో చూడొద్దని వైఎస్ షర్మిల కోరారు. తన పెళ్లికి కూడా కుటుంబ సమేతంగా వచ్చి తమ జంటను దీవించారని, అలాగే తన కుమారుడి పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చి ఆ జంటను దీవించాలని కోరినట్లు తెలిపారు. అంతే కాదు క్రిస్మస్ పండుగకు కూడా చంద్రబాబుకు, నారా లోకేశ్ కు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపాను.

ఇందుకు ప్రతిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకేశ్ ట్వీట్ చేశారన్నారు. రాజకీయం అనేది మా జీవితం కాదు, అది మా వృత్తి అని కాంగ్రెస్ నేత షర్మిల అన్నారు. ప్రజల పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకోవటం సహజమని షర్మిల వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదని, దాని వల్ల ఎలాంటి లావాదేవీలు ఉండవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ బాధ్యతను అప్పగించినా శిరసా వహిస్తానని అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే వైఎస్. రాజశేఖర్ రెడ్డి లక్ష్యంగా ఉండేదని, ఆ లక్ష్యాన్ని కొనసాగించేందుకు తనవంతు కృషి చేస్తానని షర్మిల వెల్లడించారు. కాగా షర్మిల తన కుమారుడి పెళ్లి ఆహ్వానానికి ఆమె పలువురు రాజకీయ , ప్రముఖులను కలిసి వివాహ పత్రిక అందజేస్తున్నారు. ఇది వరకే సిఎం రేవంత్‌రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చారు. కాగా ఆమె కుమారుడు రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి 18న , వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరుగనుంది.

Sharmila and Chandrababu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News