Monday, December 23, 2024

పాకిస్థాన్ చెత్త ప్రదర్శన.. చీఫ్ సెలక్టర్ పదవికి ఇంజిమామ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

కరాచీ : వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శ చేస్తున్న పాకిస్థాన్ జట్టుపై.. ఆ దేశంలో నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్ ఓడిపోవటంతో మరింత కోపోద్రేకానికి గురవుతున్నా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు. జట్టు ఆటతీరుతో పాక్ క్రికెట్ బోర్డుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ చెత్త జట్టును ఎంపిక చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌పై వేటు వేసింది. ఇంజిమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.

ప్రపంచ కప్ కోసం హైదరాబాద్‌లో దిగిన పాక్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి ఊపు మీదే కనిపించింది. నెదర్లాండ్స్, శ్రీలంకపై మ్యాచ్‌ల్లో గెలిచిన బాబర్ సేన ఆ తర్వాత వరుసగా భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లపై ఓడింది.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనే కాదు ఫీల్డింగ్ విషయంలో పాక్ జట్టు పేలవ ఆటతీరును ప్రదర్శించింది. దీంతో ఆ జట్టుపై క్రికెట్ అభిమానులు మండి పడుతున్నారు. మాజీలు సయితం పాక్ జట్టు ఆట తీరుపై విమర్శలు చేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం కూడా సరిగా లేనట్టు తెలుస్తుంది.

ఈ కారణాలతోనే పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ తన పదవికి రాజీనామా చేసాడనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. వరల్ కప్ లో దాదాపుగా సెమీస్ అవకాశాలను కోల్పోయిన పాక్. ఈ టోర్నీ అనంతరం బాబర్ అజామ్‌ని కెప్టెన్ నుండి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి ఆటగాళ్ల మధ్య విబేధాలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ మెగా టోర్ని ముగిసేసరికి పాక్ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News