Sunday, December 22, 2024

వినేశ్ ఫొగట్ కు న్యాయం చేయాలి !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై కాస్త బరువెక్కువయినందున వేటు పడింది. దీనిపై ప్రతిస్పందించిన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి. ఉషా ‘‘ కొద్ది సేపటి క్రితమే ఒలింపిక్ క్రీడాగ్రామంలోని పాలిక్లినిక్ లో వినేశ్ ను కలిశాను. భారత ఒలింపిక్ సంఘం, భారత ప్రభుత్వం, దేశం యావత్తు ఆమెకు అండగా ఉందని హామీ ఇచ్చాను. వినేశ్ కు వైద్యపరంగా, భావోద్వేగపరంగా సాయం అందిస్తున్నాము. అనర్హత వేటు విషయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ దృష్టికి తీసుకెళ్లింది. ఫైనల్స్ కు సిద్ధం చేసేందుకు ఆమె వైద్య బృందం అవిశ్రాంతంగా ప్రయత్నం చేస్తోంది’’  అన్నారు.

ఇదిలావుండగా ప్రతిపక్ష ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు మెయిన్ గేట్ వద్ద ‘ఒలింపిక్స్ లో అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ న్యాయం చేయలి’ అని డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News