Monday, December 23, 2024

ఐఓసి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -
  • భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కొండపాక: కొండపాక మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఐఓసి భవన నిర్మాణ పనులను నెల రోజల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అదేశించారు. గురువారం కొండపాకలోని ఐఏఓసి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులన్నింటిని చూశారు. తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు తెలిపారు. ఎంపిడిఓ రాంరెడ్డి, పిఆర్‌ఏఈ తిరుపతిరెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ దుర్గయ్య, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

జగదేవ్‌పూర్‌లో.. మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఐఓసి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయ నిర్మాణంలో నాణ్యతపాటించాలన్నారు. నిర్మాణం ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కార్యాలయ ప్రాంగణం సందర్శకులకు ఆనుకూలంగా ఉండే విధంగా ఉండాలన్నారు. నాణ్యతప్రమాణాలు పాటించకుంటే కఠీన చర్యలు ఉంటాయన్నారు. వచ్చే సెప్టెంబర్ వరకు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బాలేశం గౌడ్, తహశీల్దార్ రగువీరారెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాసవర్మ, విద్యుత్ ఎఈ, వివిధ శాఖ అధికారులు ,నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News