Sunday, December 22, 2024

స్కూల్లో విద్యార్థి కాల్పులు..ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

పెర్రి(అమెరికా): శీతాకాలం సెలవుల అనంతరం గురువారం పునఃప్రారంభమైన ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో హైస్కూలు ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు. కాల్పులలో పాల్పడిన విద్యార్థి గన్‌తో తనను తాను కాల్చుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. లోవా రాష్ట్రంలోని పెర్రీ పట్టణంలో ఈ దారుణ ఘటన జరిగింది. కాల్పులకు పాల్పడిన విద్యార్థిని 17 ఏళ్ల డైలన్ బట్లర్‌గా గుర్తించారు. అతడి వద్ద పంప్ యాక్షన్ షాట్‌గన్, ఒక హ్యాండ్‌గన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ విద్యార్థి ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడవలసి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు. ప్రాథమిక పాఠశాల నుంచే తన సోదరుడు బట్లర్‌పై స్కూలులో వేధింపులు జరుగుతున్నాయని అతని సోదరి తెలిపింది. స్కూలు అధికారులు జోక్యం చేసుకోకపోవడంతో అతను విసిగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ఆమె చెప్పింది. క్షతగాత్రులలో ఒకరికి తీవ గాయాలైనప్పటికీ ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News