Friday, December 27, 2024

ఐఫోన్ ఎగుమతుల్లో కొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -
మేలో భారతదేశం నుండి రూ.10,000 కోట్ల ఐఫోన్ ఎగుమతులు

న్యూఢిల్లీ : మే నెలలో భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతిలో యాపిల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ) నివేదిక ప్రకారం, మే నెలలో భారతదేశం నుండి మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ. 12,000 కోట్లు, అందులో 80 శాతం ఐఫోన్‌లు ఉన్నాయి. గత నెలలో భారతదేశం నుండి రూ. 10,000 కోట్ల విలువైన ఐఫోన్ ఎగుమతులు జరిగాయి.

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 5 బిలియన్ డాలర్ల (రూ.40,951 కోట్లు) విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. దీంతో భారత్‌లో ఈ మైలురాయిని సాధించిన తొలి బ్రాండ్‌గా ఐఫోన్ నిలిచింది. అంతేకాఐదు 202324 మొదటి రెండు నెలల్లో భారతదేశం నుండి రూ. 20,000 కోట్ల (2.4 బిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ విలువైన ఐఫోన్‌లు ఎగుమతి జరిగాయి. కాగా, గత ఏడాది(202223) తొలి రెండు నెలల్లో రూ.9,066 కోట్ల విలువైన యాపిల్ ఫోన్‌లను భారత్ ఎగుమతి చేసింది. ఐసిఇఎ డేటా ప్రకారం, మేలో భారతదేశం నుండి మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో యాపిల్ 80 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 20 శాతం సామ్‌సంగ్, ఇతర బ్రాండ్‌లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News