Thursday, January 23, 2025

ఐపిఎల్ షెడ్యూల్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

IPL 15th Season to begin from March 26th

 ఐపిఎల్ షెడ్యూల్ వచ్చేసింది
 మార్చి 26 నుంచి మెగా టోర్నీ షురూ
 తొలి మ్యాచ్‌లో తలపడనున్న సిఎస్‌కె x కెకెఆర్
ముంబై: భారత క్రికెట్ అభిమానులకు ఇక పండగే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఐపిల్ 15వ సీజన్ షెడ్యూల్ రానే వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఆదివారం సాయంత్రం ఐపిఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 26న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఐపిఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 65 రోజుల పాటు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెడింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌xకోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ముంబై వాంఖెడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, డివై పాటిల్ స్టేడియంలో 20 మ్యా చ్‌లు, బ్రాబౌర్న్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు, పూణె ఎంసిఎ మైదానంలో 15 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. కాగా, ఈసారి 12 డబుల్ హెడర్లు (ఒక రోజు లో రెండు మ్యాచ్‌లు) ఉంటాయి. డబుల్ హెడర్‌లో తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతాయి. ఐపిఎల్ టోర్నీ ఫైనల్ మే 29న జరగనుంది. కాగా, కరోనా పరిస్థితుల కారణంగా భారత్‌లోని రెండే నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని మూడు స్టేడియాలు, పూణెలోని ఓ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

IPL 15th Season to begin from March 26th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News