Friday, September 20, 2024

ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

 ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్
చెలరేగిన వార్నర్, సాహా.. ముంబైపై హైదరాబాద్ ఘన విజయం

IPL 2020: SRH Win by 10 Wickets against MI

షార్జా: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది. మంగళవారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి నాకౌట్ రేసులో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 17.1 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ను కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ అవకాశాలకు తెరపడింది. ఇక ఎలిమినేటర్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్ తలపడుతుంది. అబుదాబి వేదికగా శుక్రవారం ఎలిమినేటర్ పోరు జరుగనుంది. మరోవైపు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వాలిఫయర్‌కు అర్హత సాధించాయి. గురువారం ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచి జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళుతోంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో రెండో క్వాలిఫయర్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరుగనుంది.
సాహా, వార్నర్ జోరు..
ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్‌లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఇద్దరు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ జట్టును లక్షం దిశగా నడిపించారు. ముంబై బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఆరంభంలో వార్నర్ కాస్త నెమ్మదిగా ఆడాడు. అయితే సాహా మాత్రం తొలి ఓవర్ నుంచే దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ముంబై బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు సాహా, అటు వార్నర్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో హైదరాబాద్ అలవోకగా లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 58 బంతుల్లోనే పది ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 85 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన వృద్ధిమాన్ సాహా 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో హైదరాబాద్ మరో 17 బంతులు మిగిలివుండగానే జయకేతనం ఎగుర వేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైను కీరన్ పొలార్డ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో పొలార్డ్ వరుస సిక్సర్లతో చెలరేగి పోయాడు. దూకుడుగా ఆడిన పొలార్డ్ 25 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (33), సూర్యకుమార్ (36), డికాక్ (25) పరుగులు సాధించారు. మిగతావారు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ మూడు, హోల్డర్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

IPL 2020: SRH Win by 10 Wickets against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News