దుబాయి: ఐపిఎల్‌లో ఈసారి తిరుగులేని విజయాలతో ఇప్పటికే ప్లేఫ్స్‌కు అర్హత సాధించిన రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సోమవారం అగ్గ్రస్థానం కోసం పోటీ పడనున్నాయి. యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ రెండో దశలో ఈ రెండు జట్లు కూడా తిరుగులేని విజయాలతో దూసుకుపోవడమే కాకుండా ఇప్ప టికే ప్లేఆఫ్స్‌కు అర్హత కూడా సాధించాయి. గత ఏడాది ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక పోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం ధోనీ నేతృత్వంలో అద్భుతంగా రాణిస్తోంది. శనివారం మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో దురదృష్టవశాత్తు ఓటమి పాలయినప్పటికీ ఆ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడమే కాకుండా నెట్ రన్‌రేట్ ఆధారంగా టాప్‌లో కొనసాగుతోంది.
ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చెన్నైతో సమానంగా పాయింట్లతో నిలిచి ప్లేఆఫ్ కు చేరడమే కాకుండా ఈ సారి ఎలాగైనా కప్ గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. కాగితం మీద చూడడానికి ఈ రెండు జట్లు అటు బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను పటిష్టంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలించే దుబాయి మైదానంలో బ్యాట్స్ మెన్ రాణించడంపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని క్రికెట్ పండితుల అంచనా. ఎవరు గెలిచినాప్రత్యర్థి జట్టుకు వచ్చే నష్టమేమీ లేదు కానీ మానసికంగా ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఇరు జట్లు చివరిదాకా ప్రయత్నించే అవకాశం ఉంది.
IPL 2021: CSK vs DC Match today at Dubai