ముంబై: ఐపిఎల్ 14వ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తడబడింది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ, రాజస్థాన్ జట్టుకు 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీ షా(2), శిఖర్ ధావన్(9)లు వెంటవెంటనే ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె(8), స్టోయినిస్(0)లు కూడా పెవిలియన్ చేరారు. దీంతో 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ పంత్, లలిత్ యాదవ్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతునే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దూకుడుగా ఆడిన పంత్ 32 బంతుల్లో 9ఫోర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన టామ్ కర్రన్(21) పర్వాలేదనిపించాడు.రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజార్ రెండు వికెట్లు, క్రిస్ మోరీస్ ఒక వికెట్ తీశాడు.
IPL 2021: DC sets 148 runs target against RR