Saturday, November 23, 2024

విలియమ్సన్ పోరాటం వృధా.. ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ చివరి బంతికి విజయం సాధించింది. అంతకు ముందు టైగా ముగియడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ముందు గా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. దీంతో మ్యా టైగా ముగియక తప్పలేదు. ఇక హైదరాబాద్ జట్టులో కేన్ విలియమ్సన్ అసాధారణ పోరాట పటిమను కనబరిచాడు. చివరి వరకు అజేయంగా నిలిచిన విలియమ్సన్ 51 బంతుల్లో 8 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన జానీ బెయిర్‌స్టో 18 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 38 పరుగులు సాధించాడు. చివర్లో జగదీష సుచిత్ 6 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 14 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఆదుకున్న పృథ్వీషా…
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ధావ న్ కాస్త సమన్వయంతో ఆడగా పృథ్వీషా దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు సన్‌రైజర్స్ బౌలర్లు చాలా సేపటి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 26 బంతుల్లో మూడు ఫోర్లతో 28 పరుగులు చేశాడు. కుదురుగా ఆడుతున్న ధావన్‌ను రషీద్ ఖాన్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికే ధావన్ 81 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. తర్వాతి ఓవర్‌లోనే పృథ్వీషా రనౌటయ్యాడు. ధాటిగా ఆడిన పృథ్వీషా 39 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 53 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను తనపై వేసుకున్నాడు. అతనికి సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అండగా నిలిచాడు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కెప్టెన్సీ ఇన్నిం గ్స్ ఆడిన రిషబ్ పంత్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వేగంగా 37 పరుగులు చేశాడు. ఇదే సమయంలో స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు కీలకమైన 58 పరుగులు జోడించాడు. ఇక ధాటిగా బ్యాటింగ్ చేసిన స్మిత్ 25 బంతుల్లో మూడు బౌండరీలు, ఒక ఫోర్‌తో 34 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు దండుకుని ఢిల్లీకి మెరుగైన స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

IPL 2021: DC won Super Over against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News