Saturday, November 23, 2024

కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ..

- Advertisement -
- Advertisement -

ఓడిన హైదరాబాద్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ
బెయిర్‌స్టో, మనీష్ అర్ధ సెంచరీలు వృథా
కోల్‌కతా చేతిలో 10 పరుగులతో పరాజయం
చెన్నై: ఐపిఎల్ తొలి పోరులో హైదరాబాద్ సన్‌రైజర్స్ ఓటమి పాలయింది. చెన్నైలోని ఎంఎఎం చిదంబరం మైదానంలో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పది పరుగుల తేడాతో పరాజయం పాలయింది. తొలుత బ్యాట్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠీలు చెలరేగి అర్ధ సెంచరీలు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు బారీ స్కోరు చేసింది. ఆ తరాత 188 పరుగుల భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రౌజర్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్(3) ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(7)కూడా ఔటవడంతో సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండేల, మెయిర్‌స్టోలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించడంతో సన్‌రైజర్స్ విజయంపై ఆశలు చిగురించాయి. అయితే ఈ దశలో చక్కగా ఆడుతున్న బెయిర్‌స్టో ఔటవడంతో ఆ జట్టుకు మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 40 బంతులను ఎదుర్కొన్న బెయిర్‌స్టో 5 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 55 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్, నబీ విఫలమవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. మనీష్ పాండే 60 పరుగులతో చివరి వరకు నిలిచినా జతగా ఎవరూ రాణించక పోవడంతో జట్టును విజయ తీరాలకు చేర్చలేక పోయాడు. చెలరేగిన రాణా, త్రిపాఠి
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. నితీష్ రాణా (56 బంతుల్లో 80), రాహుల్ త్రిపాఠి( 29 బంతుల్లో 53)అర్ధ శతకాలతో చెలరేగి పోయారు. చివర్లోహైదరాబాద్ బౌలర్లు చెలరేగి పోవడంతో కోల్‌కతా 14పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. లేకపోయి ఉంటే ఆ జట్టు 200 పరుగులకు పైగానే స్కోరు చేసి ఉండేది. అయితే దినేశ్ కార్త్తీక్ (22 పరుగులు) కేవలం 9 బంతుల్లోనే ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదడంతో హైదరాబాద్ ముందు భారీ లక్షాన్ని ఉంచింది. హైదరాబాద్ బౌలర్లలో నబీ, రషీద్ ఖాన్‌లు చెరి రెండు వికెట్లు పడగొట్టగా నటరాజన్, భువనేశ్వర్ ప్రసాద్‌లకు చెరో వికెట్ దక్కింది. కోల్‌కతా ఓపెనర్లు నితీష్ రాణా, శుభ్‌మన్‌గిల్‌లు తొలి వికెట్‌కు అర్ధ శతకం భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ ప్రమాదకరంగా మమారుతున్న క్రమంలో రషీద్ వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఓ చక్కటి బంతితో శుభమన్(15) క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత రాహుల్ త్రిపాఠీతో జోడీ కట్టిన రాణా చెలరేగిపోయాడు. వీరిద్దరూ సన్‌రైజర్స్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం సాధించారు. రెండో వికెట్‌కు 93 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.అయితే 16 వ ఓవర్‌లో నటరాజన్ త్రిపాఠీని ఔట్ చేసి సన్‌రౌజర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. త్రిపాఠీ 5 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అ తర్వాత రాణా, రసెల్(5), మోర్గాన్ (2) వెంటవెంటనే ఔటయ్యారు. చివర్లో షకీబ్ సాయంతో కార్తీక్ వరస బౌండరీలు బాదడంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించింది. జట్టులో అత్యధిక స్కోరు చేసిన రాణా 9 బౌండరీలు, నాలుగు సిక్స్‌లతో 80 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు కారణమైనాడు.

IPL 2021: KKR Beat SRH by 10 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News