దుబాయి: సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. హైదరరాబాద్ నిర్దేశశిచిన 116 పరుగుల లక్షాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అర్ధ శతకం(57), నితీశ్ రాణా 25పరుగులు చేశాడు. అయితే వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీలు మాత్రం ఎక్కువ సేపు నిలవలేక పోయారు. ఆఖర్లో వచ్చిన దినేశ్ కార్తిక్(18), ఇయాన్ మోర్గాన్(2)లు జట్టును విజయ తీరానికి చేర్చారు. ఈ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రై రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థి ముందు దీటైన లక్షాన్ని ఉంచడంలో మరోసారి విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విలియమ్సన్ చేసిన 26 పరుగులే టాప్ స్కోరుగా ఉందంటే జట్టులోని బ్యాట్స్‌మెన్ ఎంత ఘోరంగా విఫలమైనారో అర్థమవుతుంది. అబ్దుల్ సమద్(25), ప్రియమ్ గార్గ్(21) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వారంతా వరసబెట్టి పెవిలియన్‌కు క్యూ కట్టారు. హైదరాబాద్‌కు అదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. టిమ్‌సౌథీ వేసిన రెండో బంతికు వృద్ధిమాన్ సాహా(0) ఎల్‌బిగా పెవిలియన్ చేరాడు. జేసన్ రాయ్(10), అభిషేక్ శర్మ(6), రషీద్ ఖాన్(6)లు కూడా ఎక్కువ సేపు నిలవలేదు. జేసన్ హోల్డర్ కేవలం 2 పరుగులు చేసి నిరాశపరిచాడు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి తలా రెండు వికెట్లు సాధించగా, షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టాడు.
IPL 2021: KKR Beat SRH with Wickets