Friday, November 22, 2024

నాలుగో బెర్త్ కోసం ఆసక్తికర పోటీ..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్ సీజన్14 తుది దశకు చేరుకుంది. ఇక ప్రతి జట్టు ఒక్కొ లీగ్ మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు నాకౌట్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఒక స్థానం కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ చెరో 12 పాయింట్లతో నాకౌట్ అవకాశలను సజీవంగా ఉంచుకున్నాయి. కాగా శుక్రవారం జరిగే మ్యాచ్‌ల తర్వాతే ఏ జట్టు నాకౌట్‌కు అర్హత సాధిస్తుందనే దానిపై స్పష్టత వస్తోంది.

గురువారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. చెన్నైతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్‌తో కోల్‌కతా తలపడనున్నాయి. కోల్‌కతా విజయం సాధిస్తే నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. అయితే సన్‌రైజర్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ముంబై ఓడితే కోల్‌కతా నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆఖరి మ్యాచ్‌లో ముంబై గెలిస్తే అప్పుడూ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ముంబై, కోల్‌కతాలలో ఎవరి రన్‌రేట్ మెరుగ్గా ఉంటే ఆ జట్టు నాకౌట్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం కోల్‌కతా రన్‌రేట్‌లో అందరికంటే ముందంజలో ఉంది. ఒకవేళ రాజస్థాన్ చేతిలో కోల్‌కతా, పంజాబ్ చేతిలో చెన్నై ఓడితే నాకౌట్ బెర్త్ కోసం పోటీ మరింత రసవత్తరంగా మారుతోంది.

IPL 2021: MI and KKR Fight for 4th place

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News