- Advertisement -
ముంబై: ఐపిఎల్ 2021లో భాగంగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు సగం ఓవర్లకే ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టుకు చెన్నై బౌలర్ దీపక్ చహర్ గట్టి షాక్ ఇచ్చాడు. 4 ఓవర్ల కేవలం 13 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి పంజాబ్ ను చావు దెబ్బ కొట్టాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పంజాబ్ స్టార్ బ్యాట్స్మెన్స్ మయాంక్ (0), రాహుల్ (5), గేల్ (10), పూరన్ (0), దీపక్ హుడా(10)లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. ఆ తర్వాత వచ్చిన రిచర్డ్ సన్(15)ను మోహిన్ అలీ ఔట్ చేశాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 70 పరుగుల చేసింది క్రీజులో షారుఖ్(25), అశ్విన్(0)లు ఉన్నారు.
IPL 2021: PBKS lost 5 wickets for 26 runs against CSK
- Advertisement -