ముంబై: ఐపిఎల్ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్, చెన్నై జట్టుకు 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 106 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్ దీపక్ చహర్ చెలరేగడంతో పంజాబ్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో పంజాబ్ కింగ్స్ 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మయాంక్ (0), రాహుల్ (5), గేల్ (10), పూరన్ (0), దీపక్ హుడా(10), రిచర్డ్ సన్(15)లు తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. షారుఖ్(47) రాణించడంతో పంజాబ్ 100 పరుగుల మార్క్ చేరుకోగలిగింది. చెన్న బౌలర్లలో దీపక్ చహర్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లతో పంజాబ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. మోహిన్ అలీ, బ్రావో, సామ్ కరన్ లు తలో వికెట్ తీశారు.
IPL 2021: PBKS Set up 107 runs target for CSK