- Advertisement -
ముంబై: ఐపిఎల్ 14లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. దీంతో పంజాబ్, ఢిల్లీకి 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(61), మయాంక్ అగర్వాల్(69) అర్థశతకాలతో చెలరేగారు. ఆరంభం నుంచి ఢిల్లీ బౌలర్లపై విరుచుకపడ్డారు. దీంతో రన్‌రేట్ 10కి తగ్గకుండా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో దీపక్ హుడా(22 నాటౌట్), షారుక్ ఖాన్(15 నాటౌట్)లు బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, మెరీవాలా, రబాడ, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.
IPL 2021: PBKS Sets 196 runs target to DC
- Advertisement -