Monday, November 25, 2024

పంజాబ్ ఆల్‌రౌండ్ షో.. బెంగళూరుపై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చాలెంజర్స్‌కు షాక్.. పంజాబ్ ఘన విజయం
రాణించిన రాహుల్, హర్‌ప్రీత్ ఆల్‌రౌండ్ షో

అహ్మదాబాద్ : ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ మూడో మూడో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 34 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ దేవ్‌దుత్ పడిక్కల్ ఈసారి నిరాశ పరిచాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి మెరిడిత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి తనపై వేసుకున్నాడు. అతనికి రజత్ పాటిదార్ అండగా నిలిచాడు.

అయితే పంజాబ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో కోహ్లి, రజత్‌లు ధాటిగా ఆడలేక పోయారు. ఈ క్రమంలో స్కోరును పెంచే ఉద్దేశంతో భారీ షాట్లకు దిగిన కోహ్లిని హర్‌ప్రీత్ బ్రార్ వెనక్కి పంపాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన మాక్స్‌వెల్(0), డివిలియర్స్(3) నిరాశ పరిచారు. ఈ రెండు వికెట్లు కూడా హర్‌ప్రీత్‌కే దక్కాయి. ఆ తర్వాత బెంగళూరు మళ్లీ కోలుకోలేక పోయింది. చివర్లో హర్షల్ పటేల్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 31 పరుగులు చేయడంతో బెంగళూరు ఆ మాత్రమైన స్కోరును చేయగలిగింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ను కెప్టెన్ లోకేశ్ రాహుల్ ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ ఐదు సిక్స్‌లు, మరో ఏడు ఫోర్లతో 57 బంతుల్లోనే 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్రిస్ గేల్ రెండు సిక్సర్లు, మరో ఆరు బౌండరీలతో వేగంగా 46 పరుగులు చేశాడు. ఇక హర్‌ప్రీత్ 25 (నాటౌట్) ధాటిగా ఆడడంతో పంజాబ్ మెరుగైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.

IPL 2021: PBKS win by 34 runs against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News