ఐపిఎల్ మళ్లీ షురూ
సెప్టెంబర్ 19న ముంబై, చెన్నై మధ్య కీలక మ్యాచ్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 14వ సీజన్ సెప్టెంబర్ 19నుంచి తిరిగి ప్రారంభం కానుంది. తొలిరోజైన సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు తలపడనున్నాయి. నూతన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10న క్వాలిఫైయన్ 1, అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 13న క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ‘మేం సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపిఎల్14వ సీజన్‌ను పునరుద్ధరిస్తున్నాం. అక్టోబర్ 10, 13 తేదీల్లో క్వాలిఫైయర్ 1, 2 మ్యాచ్‌లు నిర్వహిస్తాం. అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే అన్ని టీమ్‌లకు తెలియజేస్తాం’ అని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. గత వారం బిసిసిఐ కార్యదర్శి జైషా ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. భారతక్రికెట్ బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను మరోసారి దుబాయిలో నిర్వహించబోతున్నదని ఆయన ప్రకటించారు. ఐపిఎల్‌కు సంబంధించి జైషా ఇటీవల యుఎఇ సాంస్కృతిక, యువజన, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి షేక్ సహ్యాన్‌ను కలిసి మాట్లాడారు.
IPL 2021 to Resume with MI vs CSK on Sep 19