- Advertisement -
న్యూఢిల్లీ: తన అభిమానులకు మహేంద్ర సింగ్ ధోనీ షాకిచ్చాడు. ఈనెల 26 నుంచి భారత్ లో ఐపిఎల్ 15వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇన్నాళ్లు చెన్నై జట్టుకు సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కొనసాగిన ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నాడు. దీంతో జట్టు మెనేజ్ మెంట్ నూతన కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించింది. కాగా, 2008 నుంచి చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్ సీజన్లలో ధోనీ నాలుగు సార్లు 2010, 2011, 2018, 2021లో చెన్నై జట్టను విజేతగా నిలబెట్టాడు. మరి, ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న జడేజా ఎలా జట్టును ముందుకు నడిపిస్తాడో చూడాలి.
IPL 2022: Dhoni quits as Captaincy of CSK
- Advertisement -