Wednesday, January 22, 2025

అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ఇరు జట్లకు ఐపిఎల్ ప్రస్థానంలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్‌ను కనబరచడంతో లక్నో ఒక దశలో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే దీపక్ హుడా (55), అయూష్ బదోని (54) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. కృనాల్ పాండ్య 21 (నాటౌట్) కూడా రాణించడంతో లక్నో స్కోరు 158 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాటియా 40(నాటౌట్), హార్దిక్ పాండ్య (33), మాథ్యూ వేడ్ (30)లు మెరుగ్గా రాణించడంతో గుజరాత్ జయకేతనం ఎగుర వేసింది.

IPL 2022: GT Win by 5 wickets against LSG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News