Sunday, January 19, 2025

ఎదురులేని గుజరాత్.. లక్నోపై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

 

పుణె: ఐపిఎల్‌లో హార్దిక్ సేన మరో విజయం నమోదు చేసింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్ టీమ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు దూసుకెళ్లిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఒంటరి పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 7 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. మిల్లర్ (26), తెవాటియా 22 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది. డికాక్ (11), దీపక్ హుడా (27), అవేశ్ ఖాన్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు, సాయికిశోర్, యశ్ దయాల్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

IPL 2022: GT Win by 62 runs Against LSG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News