Friday, December 20, 2024

ముంబైపై కోల్‌కతా గెలుపు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ సీజన్15లో ముంబై ఇండియన్స్ ఓటములు పరంపర కొనసాగుతోంది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 52 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ధాటిగా ఆడిన వెంకటేశ్ 4 సిక్సర్లు, మూడు ఫోర్లతో 43 పరుగులు చేశాడు. నితీష్ రాణా (43), రహానె (25), రింకు సింగ్ 23 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్, సౌథి, రసెల్, నరైన్ తదితరులు అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించారు. కమిన్స్‌కు మూడు, రసెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ముంబై జట్టులో ఇషాన్ కిషన్ (51) ఒక్కడే ఒంటరి పొరాటం చేశాడు.

IPL 2022: KKR win by 52 Runs against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News