Thursday, December 19, 2024

చిత్తుగా ఓడి ఇంటిదారి పట్టిన సన్‌రైజర్స్..

- Advertisement -
- Advertisement -

పుణె: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలకు తెరపడింది. శనివారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 54 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో హైదరాబాద్ నాకౌట్ అవకాశాలు నీరుగారాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బిల్లింగ్ (34), ఆండీ రసెల్ 49 (నాటౌట్) జట్టును ఆదుకున్నారు. ఓపెనర్ రహానె (28), నితీష్ రాణా (26) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ అభిషేక్ వర్మ (43), ఐడెన్ మార్‌క్రామ్ (32) మాత్రమే రాణించగా మిగతావారు విఫలమయ్యారు. రసెల్ ఆల్‌రౌండ్‌షోతో కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

IPL 2022: KKR win by 54 runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News